సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో మునిగిపోతారు. 70 ఏళ్లు దాటినా ఆయన అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనా, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
సినిమా వల్ల నా కెరీర్ దెబ్బతిన్నదని
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.ఇక ఇదిలా ఉంటే, రజినీకాంత్‌తో చేసిన సినిమా వల్ల నా కెరీర్ దెబ్బతిన్నదని ఓ ప్రముఖ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సాధారణ హీరోయిన్ కాదు, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి హిట్‌లు అందించిన నటి మనీషా కొయిరాలా (Actress Manisha Koirala).భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ద్వారా తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడినా, ధైర్యంగా పోరాడి తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని తెలిపింది. రజినీకాంత్ తో కలిసి బాబా సినిమాలో నటించింది మనీషా కొయిరాలా. అయితే బాబా సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది. బాబా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో తనకు సౌత్ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి అని తెలిపింది. బాబా కు ముందు సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి..కానీ బాబా తర్వాత ఆఫర్స్ రాలేదు అని తెలిపింది మనీషా కొయిరాలా. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
మనీషా కొయిరాలా నటించిన తెలుగు సినిమాలు ఏవి?
భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది.
మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడ్డారా?
అవును, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ధైర్యంగా పోరాడి జయించారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: