టాలీవుడ్‌లో కొత్త తరానికి చెందిన హీరోలలో రోషన్ మేక (Roshan Meka) పేరు ముందుంటుంది. 90వ దశకంలో సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీకాంత్ (Actor Srikanth) కుమారుడిగా రోషన్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి సినీ అభిమానుల దృష్టి అతడిపై ఉంది. అయితే ఈ చిత్రం నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చంద్రలేఖ పాత్రలో అనస్వర నటించబోతుండగా.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు
ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా తన ప్రతిభను చూపించిన రోషన్, ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘ఛాంపియన్’ (Champion) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బిగ్ బ్యానర్‌లో వస్తుండటంతో పాటు, క్రియేటివ్ కథా నేపథ్యం ఉండటం ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: