ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదల కారణంగా ప్రముఖ బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మాధవన్ (Madhavan) స్వయంగా సోషల్ మీడియా వేదికగా తాను వరదల్లో చిక్కుకున్న విషయాన్ని వెల్లడించారు. “17 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకసారిగా వర్షాల కారణంగా లేహ్‌లో చిక్కుకున్నాను. గతంలో ‘త్రీ ఇడియట్స్’ సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇప్పుడు మరోసారి అదే అనుభవం ఎదురవుతోంది” అని మాధవన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో బయటకు రావడం కష్టమైందని ఆయన తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా
వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా కొంతమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు.ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిన్న చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు. ఎన్నో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలోనూ వరదల ధాటికి పెద్ద నగరాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. వరదల్లో చుక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: