ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ముందుకు వస్తున్న చిత్రం ‘కుబేర’ (‘Kubera’).ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ (Directed by Sekhar Kammula) చేస్తున్నాడు. హైలైట్ ఏంటంటే, అక్కినేని నాగార్జున (Nagarjuna) మరియు కోలీవుడ్ స్టార్ ధనుష్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నారు.జూన్ 1న ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి, సినిమా ప్రమోషన్స్‌కి గేర్ ఇచ్చిన చిత్ర బృందం, తాజాగా ‘అనగనగా కథ’ అనే పాటను విడుదల చేసింది. ఈ పాట ద్వారా కథలోని ప్రధాన పాత్రల ఎమోషన్స్, వారి ప్రయాణాన్ని హృద్యంగా చూపించారు. చంద్రబోస్ రాసిన ఈ భావోద్వేగాల పాటకు హైడ్ కార్తి, కరీముల్లా గొంతు కలిపారు. పాటలో వచ్చే లిరిక్స్ వినిపించగానే, కథలోని లోతు స్పష్టమవుతుంది.
శేఖర్ కమ్ముల మార్క్ కథనం
శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎమోషన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘కుబేర’లో కూడా ఆయన మేజిక్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భావోద్వేగాలకు తోడు, విభిన్నమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేయాలనే లక్ష్యంతో తయారవుతోంది.
రష్మిక మందన్నా హీరోయిన్‌గా – మ్యూజిక్ డీఎస్‌పీ
ఈ చిత్రంలో రష్మిక మందన్నా లీడ్ హీరోయిన్‌గా కనిపించనుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలతో మాయ చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ధనుష్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందనే టాక్ ట్రెండ్‌లో ఉంది.
రిలీజ్ డేట్ ఫిక్స్ – పోటీని లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారు
ప్రస్తుతం జూన్ 20న ‘కుబేర’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ముందు వీరమల్లు, తర్వాత కన్నప్ప వంటి భారీ సినిమాలు ఉన్నా కూడా, ‘కుబేర’ టీమ్ మాత్రం ధైర్యంగా ముందుకెళ్తోంది. ఇది సినిమాపై వారికి ఉన్న నమ్మకాన్ని చూపుతోంది.
Read Also : OTT: ఈ వారం ఓటీటీ లోకి వచ్చే మూవీస్ ఇవే