తెలుగు సినిమా, నాటక రంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తన విశిష్ట నటనతో గుర్తింపు పొందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) గారు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖులూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానులు, సహ నటులు, రాజకీయ నేతలు పెద్దఎత్తున ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందన:
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోట మృతిపై స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆయన తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తనికెళ్ల భరణి భావోద్వేగ స్పందన:
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి (Tanikella Bharan)గారు కోట గారి గురించి భావోద్వేగంతో ఇలా స్పందించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయిందని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నాటకాలపై ఉండే ఎనలేని ఆసక్తే ఆయన సినీ రంగ ప్రవేశానికి దారులు వేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
బ్రహ్మానందం స్పందన:
సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం గారు కోట గారి మృతిని గుండెకు పెద్ద బాదగా పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారని పేర్కొన్నారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని కొనియాడారు. నాలుగు దశాబ్దాలపాటు తాము కలిసి పనిచేశామని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు.
రవితేజ ఘన నివాళి:
కోటా శ్రీనివాసరావును చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగానని ప్రముఖ నటుడు రవితేజ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Peddi Movie: ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ విడుదల..