హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) ఎట్టకేలకు ఓటీటీ (OTT) లోకి చేరింది. ఈ చిత్రాన్ని జీ 5 (ZEE 5) సొంతం చేసుకున్నది, దీంతో ప్రేక్షకులు నేటి నుండి సినిమాను చూడవచ్చు. థియేటర్‌లో ఈ చిత్రం చూడనివారికి ఇది పెద్ద అవకాశం.
Read Also: Silambarasan: శింబు సామ్రాజ్యం ప్రోమో వచ్చేసింది?
‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) హర్రర్-థ్రిల్లర్ శైలి చిత్రంగా రూపొందించబడింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన తర్వాత, సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన రాఘవ్ పాత్ర, ప్రేక్షకుల్ని మెప్పించింది.
రాక్షసుడు చిత్రం తర్వాత పెద్ద హిట్ లేని బెల్లంకొండకి ఈ చిత్రం ఊరట ఇచ్చింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ హర్రర్-థ్రిల్లర్ చిత్రం, థియేటర్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హీరో రాఘవ్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ , హీరోయిన్ మైథిలి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కీలక పాత్రలు పోషించారు.

కథేంటంటే
మామూలు కథను థ్రిల్‌గా మార్చే స్క్రీన్‌ప్లే, అనుపమ పరమేశ్వరన్ ప్రదర్శించిన నటన సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. ఘోస్ట్ వాకింగ్ అనే పేరుతో థ్రిల్ ను కోరుకునే వారి కోసం లేని దెయ్యాలను ఉన్నాయని నమ్మిస్తూ ఘోస్ట్ హౌసెస్ లోకి టూర్లు కండక్ట్ చేస్తుంటారు హీరో ( పాత్ర పేరు రాఘవ), హీరోయిన్లు ( హీరోయిన్ పాత్ర పేరు మైథిలి).
ఈ క్రమంలో కిష్కిందపురి అనే ఒక ఊరికి 11 మంది బ్యాచ్ తో కలిసి సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కు వెళ్తారు. అక్కడనుండి కథ మలుపు తీసుకోవడంతో మూవీ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. దెయ్యంలా మారిన వేదవతి ఎవరు. ఎందుకు అందరిని చంపాలనుకుంటుంది. వీరితో పాటు వెళ్లిన చిన్న పిల్లను కాపాడటానికి ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా హీరో ఏమి చేసాడు అనేది చిత్ర కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: