టాలీవుడ్‌లో యువహీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ మూవీ “రాజావారు రాణిగారు”తోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చిన్న బడ్జెట్‌లో వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సాధించడమే కాకుండా, కిరణ్‌కు ఒక మంచి స్టార్ట్ ఇచ్చింది. ఈ విజయం తరువాత ఆయన క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.కిరణ్ అబ్బవరం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమ (Film industry) లో హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తున్న నటుల్లో ఒకడిగా నిలుస్తున్నాడు. “SR కళ్యాణమండపం” సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ఆయన యూత్‌కు కనెక్టయ్యే పాత్రలో కనిపించి, తన మాస్ ఇమేజ్‌ను స్థిరపరచుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఆయనపై మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.
ఆశించిన రీతిలో
తర్వాత వచ్చిన “Sebastian PC 524”, “Sammathame”, “Nenu Meeku Baaga Kavalsinavaadini” వంటి సినిమాల్లో కూడా విభిన్నమైన కథాంశాలను ఎంచుకున్నాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో ఆడకపోయినా, కిరణ్ ఎంచుకునే పాత్రలపై మాత్రం ఎప్పుడూ ప్రశంసలు వినిపించాయి.ఇక ఈ రోజు కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా కె ర్యాంప్ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో కిరణ్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ చూస్తుంటే మూవీ మంచి హిట్ సాధించడం ఖాయం అంటున్నారు.
ప్రేక్షకుల ముందుకు
గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో వీరి కాంబో ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలు వచ్చాయి. ఇక KRamp చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాల్లో పాటలు, డైలాగ్స్, యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉండటం వల్ల ఆయనకు బలమైన (following) ఏర్పడింది. ముఖ్యంగా ‘SR కళ్యాణ మండపం’లో ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఆయనకు మాస్ హీరోగా బ్రాండ్‌ను కుదిర్చింది.
కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లోకి ఎలా వచ్చారు?
కిరణ్ అబ్బవరం అసలు పేరు కిరణ్. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో జన్మించిన ఆయన, ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తితో హైదరాబాదుకు వచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన నటనను ప్రదర్శించి అవకాశాలు అందుకున్నారు. చివరికి 2019లో “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
ఆయన తొలి సినిమా పేరు ఏమిటి?
కిరణ్ అబ్బవరం తొలి సినిమా పేరు “రాజావారు రాణిగారు” (2019). ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగిన హార్ట్ టచింగ్ ప్రేమ కథ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Aap Jaisa Koi Movie: ‘ఆప్ జైసా కోయి’ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ