టాలీవుడ్(Tollywood) మరియు దక్షిణాది సినీ ప్రపంచంలో కీర్తి సురేష్కి(Keerthy Suresh) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే కెమెరా ముందు నిలబడి, తెలుగు–తమిళ–మలయాళ పరిశ్రమల్లో వరుస విజయాలు సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ప్రజలు అనుకున్నంత సులభంగా ఆమె ప్రయాణం సాగలేదని కీర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.తెలుగులో ‘నేను శైలజ’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, *‘మహానటి’*తో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసింది. సావిత్రిగా ఆమె చేసిన నటన ఎన్నో ప్రశంసలు తెచ్చి పెట్టింది. ఆ చిత్రంతో కీర్తి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ కూడా సాధించింది. ఒక హీరోయిన్ కెరీర్‌లో ఇలాంటి హిట్ వచ్చిన తర్వాత వరుస సినిమాలు రావడం సహజమే. కానీ కీర్తి విషయంలో మాత్రం పూర్తిగా విపరీతంజరిగింది.
Read also: India Test Selection: టీమ్‌ఇండియా స్ట్రాటజీపై రవిశాస్త్రి సూటి విమర్శలు

కీర్తి(Keerthy Suresh) చెప్పిన ప్రకారం—‘మహానటి’ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదట. దర్శకులు, నిర్మాతలు ఆమెను సావిత్రి పాత్రలోనే ఇమేజ్ చేసుకుని, ఇతర కమర్షియల్ రోల్స్‌లో ప్రేక్షకులు ఆమెను అంగీకరిస్తారా అనే సందేహంతో రిస్క్ తీసుకోలేదట. కొందరు సీరియస్ లేదా బైఒపిక్ తరహా పాత్రలకే మాత్రమే ఆమెను పరిశీలించారని తెలిపింది. ఈ కారణంగా కమర్షియల్ మూవీ మేకర్స్ ఆమె దగ్గరకు రాలేదని కూడా చెప్పింది.
స్టార్‌హీరోయిన్‌కి కూడా ఒత్తిడి తప్పలేదా?
సూపర్‌స్టార్డమ్ వచ్చినప్పుడు ఎలా ఆనందిస్తామో… తగ్గిపోయినప్పుడు, లేకపోతే కొత్త ఆఫర్స్ రాకపోతే ఎంత ఒత్తిడి వస్తుందో కీర్తి ఓపెన్‌గా చెప్పింది. ఆ ఆరు నెలల గ్యాప్ సమయంలో తనకు తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చిందని, కెరీర్ ఏ దిశలో సాగేంది అనే భయం పట్టుకుందని వెల్లడించింది. అయినా, ఆ గ్యాప్ ఆమెను ఆపలేదు. తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఆమెకే తగ్గట్టు ఎంచుకుని, మెల్లగా తిరిగి రిథమ్‌లోకి వచ్చిందని చెప్పింది. ఈ మొత్తం ప్రయాణం ఆమెకు ఓ పాఠం లాంటిదని, స్టార్‌డమ్ వచ్చినా కూడా ఇమేజ్ ట్రాన్స్‌ఫార్మేషన్ తీసుకోవడం ఎంత కష్టం అనేది తనకు అర్థమైందని తెలిపింది.
కీర్తి సురేష్‌కు ‘మహానటి’ తర్వాత ఎందుకు ఆఫర్లు రాలేదు?
దర్శకులు ఆమెను సీరియస్ రోల్స్‌కే పక్కన పెట్టి, కమర్షియల్ సినిమాలకు సరిపోరేమో అన్న భయంతో.
గ్యాప్ ఎంతకాలం ఉంది?
దాదాపు 6 నెలలు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: