కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియర్’ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించారు. ఇప్పటికే చాలా కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ రావడంతో, విడుదలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Read also: TG: సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: కోమటిరెడ్డి

ఫైనాన్స్‌కు సంబంధించిన సమస్యలు
తొలుత ఈ సినిమాను ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన చేసినా పలు కారణాలతో అది సాధ్యం కాలేదు. వాస్తవానికి ‘వా వాతియార్’ గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 12న విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే చివరి నిమిషంలో ఫైనాన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి.
నిర్మాత చెల్లించాల్సిన కొన్ని బాకీలు క్లియర్ చేయకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుంది. సంబంధిత మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: