కర్ణాటక (Karnataka) సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కు చెందిన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేయడంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. దీనికి వ్యాపార పరమైన కారణాలు ఉన్నాయని వెల్లడించారు. స్థానిక నటీమణులు ఇప్పటికే ఇతర బ్రాండ్లతో అనుబంధమై ఉన్నారని చెప్పారు. దీపికా పదుకొనే పేరును పరిశీలించినప్పటికీ, ఆమె డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా తీసుకోలేదన్నారు.
Read Also: Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగపడతారు
మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటక (Karnataka) కే పరిమితం కాలేదు. తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8%, అంతర్జాతీయంగా 1% మార్కెట్ ఉంది. 2030 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం” అని మంత్రి తెలిపారు. తమన్నాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్, కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు, బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: