మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’ (Kannappa) ఇప్పటికే ప్రేక్షకుల మదిలో ఆసక్తిని రేకెత్తించింది. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రూపొందుతున్న డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మంచు విష్ణు ట్వీట్
ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ఎక్స్ (Twitter) వేదికగా ఒక ఆసక్తికరమైన కౌంట్‌డౌన్ పోస్టు షేర్ చేస్తూ “ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!” అంటూ అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచారు. అదే పోస్ట్‌లో, “ఇవాళ కన్నప్ప చెన్నై వీధుల్లో గర్జిస్తున్నాడు. తమిళ మీడియాకు ఇంతకుముందు చూడని ఫుటేజీని చూపించాం. భక్తి, యాక్షన్, మనసును కదిలించే కథ.. జూన్ 27న థియేటర్లలో కలుద్దాం” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇది సినిమాకు తమిళనాడులో ప్రాధాన్యత పెరిగిందని, తమిళ ప్రేక్షకులకూ ఈ కథ ఎంతగానో కనెక్ట్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
భారీ తారాగణం – భారీ అంచనాలు
ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా మంచు విష్ణు కనిపించగా, అతిథి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. అంతేకాకుండా, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ స్థాయి తారాగణంతో కన్నప్ప సినిమా ఓ విశ్వ స్థాయి ప్రతిష్ఠతో తెరకెక్కుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల నుండి విశేష స్పందనను పొందాయి.
Read also: Rakul Preet Singh : అనవసర చర్చపై రకుల్ ప్రీత్ అసహనం