kalpika: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి కల్పిక (kalpika) మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆమె వలన తన కుటుంబ సభ్యులు, ప్రజలకు ప్రమాదం ఉందని ఆమె తండ్రి సంఘవార్ గణేష్ (Sanghwar Ganesh) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు లిఖితపూర్వకంగా లేఖ రాశారు.

రెండు సార్లు ఆత్మహత్యాయత్నాలు
గతంలో కల్పిక (kalpika) రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల కారణంగా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన అనుభవించారని గణేష్ తెలిపారు. అప్పట్లో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండటంతో ఆమెను ఒక రిహాబిలిటేషన్ సెంటర్ (Rehabilitation Center) కు తరలించినట్లు వివరించారు.
రెండు సంవత్సరాలుగా మెడికేషన్ లేకుండా జీవనం
గణేష్ లేఖ ప్రకారం, కల్పిక రెండు సంవత్సరాలుగా మెడికేషన్ తీసుకోవడం ఆపేయడం వల్ల మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లిందని తెలిపారు. ఈ కారణంగా ఆమె తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ సృష్టించడం, సామాజికంగా అపజయాలు తలెత్తించడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ రిహాబిలిటేషన్‌కు పంపాలన్న విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో కల్పికను మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కి తరలించాల్సిన అవసరం ఉందని, పోలీసుల సాయంతో ఆమెకు అవసరమైన చికిత్స కల్పించాలని ఆమె తండ్రి విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల రక్షణతో పాటు కల్పిక భవిష్యత్ కోసం ఇది అవసరం అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: