గత నెలాఖరున నవంబర్21న థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్న చిత్రం కలివి వనం (Kalivi Vanam). ఈ చిత్రంతో ప్రముఖ జానపద స్టార్ నటి నాగ దుర్గ (Naga Durga) కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి (Bithiri Sathi) వంటి పేరున్న నటులు ప్రధాన పాత్రల్లో నటించగా ఏ. ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించాడు. నవంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది.
Read Also: Akhanda 2: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అఖండ 2 చిత్రయూనిట్
కథ
అది తెలంగాణ ప్రాంతం .. జగిత్యాల మండలం పరిధిలోని ‘గుట్రాజ్ పల్లి’ గ్రామం. అక్కడ తన తాతయ్య భూమయ్య (సమ్మెట గాంధీ)తో కలిసి హరిత ( నాగదుర్గ) నివసిస్తూ ఉంటుంది. ఆ ఊరులోని స్కూల్ కి ఆనుకుని చిన్నపాటి అడవి ఉంటుంది. ఆ అడవిని పెంచి పోషించింది భూమయ్యనే. ప్రకృతియే ప్రతి ఒక్కరినే కాపాడుతుందనేది ఆయన ఉదేశం. అందువల్లనే ఆ ఊళ్లోని వాళ్లంతా ఆయనను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు.
ఇక ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఆ ఊరు స్కూల్ పిల్లలకు ‘హరిత’ చదువు చెబుతూ ఉంటుంది. పిల్లలు ప్రకృతిని ప్రేమించేలా చేయగలిగితే, ఆరోగ్యం .. అభివృద్ధి రెండూ సాధ్యమవుతాయని ఆమె నమ్ముతుంది. అలాగే రైతులు సేంద్రియ ఎరువులు వాడటం వలన, నేల విషపూరితం కాకుండా ఉంటుందని భావిస్తుంది. అందరూ మొక్కలు పెంచాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఆమెకి జిల్లా కలెక్టర్ నుంచి సైతం గుర్తింపు లభిస్తుంది.

కథనం
ఈ నేపథ్యంలో ఆ ఊరు సర్పంచ్ విఠల్ (బిత్తిరి సత్తి) ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ అడవి ఉన్న ప్రదేశంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందనీ, ఫ్యాక్టరీ వలన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెబుతాడు. అప్పుడు హరిత ఎలా స్పందిస్తుంది? ఆ అడవిని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది (Kalivi Vanam) కథ.
పల్లెలను పట్టణాలు ఆక్రమించుకుంటూ వెళుతున్నాయి. అభివృద్ధి .. ఉద్యోగాలంటూ ఆశపెట్టి, కొండ్రు స్వార్థపరులు పల్లెలను తమ వ్యాపార సంస్థలకు నిలయాలుగా మార్చేస్తున్నారు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను పల్లెలకు తరలించి అక్కడ గాలి .. నీరు .. ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. ఎవరి స్వార్థానికి వారు పల్లెలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భావి తరాల కోసం అడ్డుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పే కథ ఇది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: