మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలంకావల్ (Kalamkaval). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. జనవరిలో ఈ సినిమా ‘సోనీలివ్’లో స్ట్రీమింగ్ కానుంది.
Read Also: Prabhas The Raja Saab : ది రాజా సాబ్ USA బాక్సాఫీస్ షాక్ ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్

ఈ సినిమా విడుదలైన 17 రోజులలోనే 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఏ దడి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. (Kalamkaval) మమ్ముట్టి కెరియర్లో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాగా కూడా ఒక కొత్తరికార్డును ఈ సినిమా దక్కించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది.
కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి, వారిని సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. ఇందులో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న ‘స్టాన్లీ దాస్’ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా, అతడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ ‘జయకృష్ణన్’ పాత్రలో వినాయకన్ నటించారు. మమ్ముట్టి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: