కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ : డబుల్ మీనింగ్ డోస్‌తో కిరణ్ అబ్బవరం మళ్లీ రంగంలోకి! ఓవర్సీస్ టాక్ ఏంటంటే…
K Ramp Twitter review : గత సంవత్సరం దీపావళి సందర్భంగా ‘క’ సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం, ఈసారి ‘కే ర్యాంప్’ అనే కొత్త కాన్సెప్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రీమియర్ షోస్ చూసిన ఎన్నారై ఆడియన్స్ ఏం అంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో చూద్దాం.
సీరియస్ సబ్జెక్ట్‌కి కామెడీ టచ్!
ఈ సినిమాతో జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రానికే ఆయన సీరియస్ టాపిక్‌ని ఎంచుకున్నారు. పీటీఎస్డీ (Post Traumatic Stress Disorder) నేపథ్యంలో కథ సాగుతుందట. అయితే, ఆ సీరియస్ ఇష్యూ చుట్టూ రాసిన కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయట. ముఖ్యంగా వన్‌లైనర్ పంచ్ డైలాగ్స్ బాగానే పడ్డాయని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి.
డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై మిక్స్డ్ టాక్
టీజర్ విడుదలైనప్పటి నుంచే ‘కే ర్యాంప్’లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినిమాలో కూడా ఆ డోస్ తగ్గలేదట. కొందరు ఆడియన్స్ “బూతు డైలాగ్స్ తగ్గించి ఉంటే ఇంకా బావుండేది” అని కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం “కామెడీ ఫ్లోలో అవి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు” అని అంటున్నారు.
ఔట్‌డేటెడ్ టెంప్లేట్ కానీ ఫన్ వర్కవుట్ అయ్యిందట!
కొంతమంది ప్రేక్షకులు సినిమా టెంప్లేట్ పాతదిగా అనిపించిందని చెబుతుండగా, మరికొందరు మాత్రం “ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ ఎంజాయ్ అయ్యింది” అంటున్నారు. కామెడీ పోర్షన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయని, కిరణ్ అబ్బవరం ఎనర్జీ సినిమా హైలైట్ అని పేర్కొంటున్నారు.
పర్ఫార్మెన్స్‌స్ బాగున్నాయంటున్నారు
కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుందని, తండ్రిగా సాయి కుమార్ తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడని, సీనియర్ నరేష్ – వెన్నెల కిశోర్ కామెడీ సినిమా మొత్తాన్ని లైట్ చేసిందని ట్వీట్లు చెబుతున్నాయి. వీరి సీన్స్ థియేటర్‌లో మంచి లాఫ్టర్ తెప్పించాయట.
ట్విట్టర్‌లో టాక్ ఇలా ఉంది
మొత్తానికి, సోషల్ మీడియాలో చూస్తే ‘కే ర్యాంప్’కు మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ వస్తోందని చెప్పొచ్చు. కామెడీ వర్కవుట్ అయిందని చాలామంది ట్వీట్లు చెబుతుండగా, కొన్ని డైలాగ్స్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :