ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పర్మిషన్ లేకుండా కొన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలు తన ఫోటోలను అనధికారింకగా ఉపయోగిస్తున్నారని.. తద్వారా తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also: Eesha Movie: ‘ఈషా’ ట్రైలర్ విడుదల

తదుపరి విచారణ డిసెంబర్ 22 కు వాయిదా
ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది.జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫిర్యాదులపై సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబర్ 22 కు వాయిదా వేస్తూ.. ఆరోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: