సినిమా ఇండస్ట్రీ ప్రతి తరం ఓ కొత్త హీరోను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలాంటి పరిచయాల్లోనే ఇప్పుడు టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్త పేరు కిరీటి రెడ్డి. రాజకీయాల్లో బలమైన నేపథ్యం కలిగిన గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన కిరీటి, మొదటి సినిమాతోనే తన డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.వైరల్ వయ్యారి సాంగ్ ద్వారా ఈ మూవీకి భారీ పబ్లిసిటీ వచ్చింది. శ్రీలీల పక్కన కిరీటి (Kiriti Reddy) డ్యాన్స్ చేసిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాటలో కిరీటి స్టెప్స్ మాస్, క్లాస్ రెండింటినీ హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.మరి ‘జూనియర్’ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథా సమీక్ష
సినిమా కథ విజయనగరం అనే గ్రామంలో ప్రారంభమవుతుంది.కోదండపాణి (వీ రవిచంద్రన్) – శ్యామల అనే దంపతులు పెద్ద వయసులో తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుసుకుంటారు. కానీ పల్లెటూరులో అందరూ దీన్ని అశ్లీలంగా, వెటకారంగా చూస్తారు. ఈ వింత వాతావరణాన్ని తట్టుకోలేక కోదండపాణి (Kodandapani) గర్భవతీ అయిన తన, భార్యతో ఊరు విడిచి వెళ్లిపోతాడు. అయితే, ప్రయాణంలోనే ఆమెకు ప్రసవ వేదన వచ్చి, తను శిశువు పుట్టగానే మరణిస్తుంది. కోదండపాణి తన భార్యను కోల్పోయినా, బిడ్డను చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు.ఈ బిడ్డే కథానాయకుడు అభిమన్యు (కిరీటి రెడ్డి). చిన్ననాటి నుంచే సమాజంలోని అసమానతలపై తిరగబడే వ్యక్తిగా ఎదుగుతాడు. అందులోనే శృతి (శ్రీలీల) అనే యువతిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ, కుటుంబ సంబంధాలు, సమాజంతో పోరాటం అన్నీ కలిపి కథ నడుస్తుంది.

ప్రచారచిత్రాల్లో
ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఆ ఏముందిలే రొటీన్ లవ్‌స్టోరీ అంతకంటే ఏముంటుంది కొత్తగా అన్న మాట ఎక్కువ వినిపించింది. నిజానికి అదే ఈ సినిమాకి ప్రధాన బలం అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త హీరో ఏం చేస్తాడో చూద్దామనే ఆలోచనతోనే ఎక్కువమంది ఆడియన్స్ థియేటర్ (Theatre) కి వెళ్తారు. వారిని ‘జూనియర్’ అన్ని విధాలుగా సాటిస్‌ఫై చేశాడు.ముఖ్యంగా ప్రచారచిత్రాల్లో కనిపించని ఎమోషన్ జూనియర్‌లో ఉంది. ఫస్టాఫ్ కాస్త పడుతూ లేస్తూ సరదాగా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్‌తో సినిమా సెకండాఫ్‌కి మంచి అంచనాలతో ప్రేక్షకుడికి స్వాగతం పలికారు. ఆ అంచనాల్ని ఎక్కడా తగ్గించకుండా సెకండాఫ్ ఉంది.
శ్రీలీల MBBS పూర్తిచేసిందా?
అవును, దక్షిణ భారత నటీమణి శ్రీలీల తన MBBS డిగ్రీను పూర్తిచేసింది. సినిమాలలో నటిస్తూ కూడా, ఆమె అనుకున్న విధంగా తన వైద్య విద్యను కొనసాగించింది.
శ్రీలీల జీవిత చరిత్ర ఏమిటి?
శ్రీలీల 2001 జూన్ 14న అమెరికాలోని డెట్రాయిట్ పట్టణంలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sir Madam Trailer: విజయ్ సేతుపతి ‘సార్ మేడమ్’ ట్రైలర్ చూసారా!