తెలుగు సినిమా ప్రేక్షకులకు మెగా కాంబో ఎంటర్టైన్‌మెంట్‌గా నిలిచే ఒక ప్రాజెక్ట్ త్వరలో రానున్నది — అదే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే పౌరాణిక చిత్రం. ఈ భారీ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం నిర్మాత నాగవంశీ తాజాగా మీడియాకు వెల్లడించారు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది తన కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలవబోతుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌ను దేవుడిగా చూపించే అరుదైన అవకాశం
సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా చూసిన తనకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ను దేవుడుగా చూపిస్తున్నాననే ఆనందం ఉందని నాగవంశీ (Nagavanshi) తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా ఆగస్ట్ నుంచి ప్రారంభమవుతుందని వచ్చే ఏడాది మధ్యలో తారక్ తో సినిమాను ప్రారంభిస్తామని తెలిపారు.
విజయ్ దేవరకొండపై ట్రోల్స్ అన్యాయమన్న నిర్మాత
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ విషయంలో జరిగిన విమర్శలపై కూడా నాగవంశీ స్పందించారు. “విజయ్ ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు అతన్ని టార్గెట్ చేస్తున్నారో అసలు అర్థం కావడం లేదు. ప్రజలు అతనిపై దురుద్దేశంతో స్పందిస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది” అని ఆయన అన్నారు.
‘వార్ 2’లో తారక్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ భారీ చిత్రం ‘వార్ 2’ గురించి కూడా నాగవంశీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆగస్ట్ 14, 2025న విడుదలకానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తారక్ పరిచయ సన్నివేశం సినిమాకు హైలైట్‌గా మారుతుందని చెప్పారు. “హృతిక్ రోషన్ మరియు తారక్ మధ్య జరిగే ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క సీన్ చూసిన తర్వాతే నేనిది తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకున్నాను” అని పేర్కొన్నారు.
వార్ 2లో ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారన్నది అసత్యం. అతనికి హృతిక్ రోషన్‌తో సమానంగా స్క్రీన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమా ఇద్దరి మధ్య సమానమైన పోటీతత్వంతో సాగుతుంది అని గట్టి క్లారిటీ ఇచ్చారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Manidargal: ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న ‘మనిదర్గళ్’ మూవీ