ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కొత్త కంటెంట్ రావడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్‌కి చెందిన కథలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో, హిందీ నుంచి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది – దాని పేరు ‘జనావర్’.
సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్
‘జనావర్’ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 లో సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తం 8 ఎపిసోడ్‌ల (8 episodes)ఈ సిరీస్‌లో ఉత్కంఠ భరితమైన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
శచింద్ర దర్శకత్వంలో ఇంటెన్స్ కథ
ఈ సిరీస్‌కు శచింద్ర దర్శకత్వం వహించగా, దీన్ని దినేశ్, అభిషేక్, మరియు హరీశ్ కలిసి నిర్మించారు. కథ, టేకింగ్, మూడ్ అన్నీ కూడి ఇది హై క్వాలిటీ థ్రిల్లర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. సిరీస్ కథానాయకుడిగా భువన్ అరోరా (Bhuvan Arora)నటించగా, అతనితో పాటు భగవాన్ తివారీ, అతుల్ కాలే, వైభవ్ యశ్వీర్, ఎషికా డే, వినోద్ సూర్యవంశీ, అమిత్ శర్మ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
దట్టమైన అడవి.. తలలేని మృతదేహం.. రహస్యాల కథ
కథ ఆధారంగా ఒక దట్టమైన అడవిలో తలలేని మృతదేహం వెలుగులోకి వస్తుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ హేమంత్ కుమార్ కేసులోకి ప్రవేశిస్తాడు. ఈ హత్య వెనక ఉన్న మిస్టరీను ఛేదించేందుకు అతను తీసుకునే సవాళ్లే ఈ కథలో కీలకం. ఇది సాధారణమైన కేసు కాదని అతనికి అర్థమయ్యేంతవరకు, మిస్టరీ మరింత గాఢంగా మారుతుంది.క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండిన ‘జనావర్’ సిరీస్, మిస్టరీ ప్రేమికులకు ఓ స్పెషల్ ట్రీట్‌గా నిలవనుంది. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: