हिन्दी | Epaper

Jana Nayagan Trailer: ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదల

Anusha
‘Jana Nayagan’ trailer released
‘Jana Nayagan’ trailer released

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సందర్బంగా, ట్రైలర్ (Jana Nayagan Trailer) విడుదలైంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ శనివారం విడుదలై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న విజయ్, ఈ సినిమాతో నటనకు వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read also: Chiranjeevi: నేడే చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్.. 

ట్రైలర్‌లో హైలైట్స్

ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మరింత ఊపందుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చూస్తే నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాను గుర్తు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ గతంలోనే అనేక కథనాలు రావడం, ఇప్పుడు ట్రైలర్‌లో కనిపించిన అంశాలతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్‌లో విజయ్ తనదైన స్టైలిష్ ఎంట్రీ, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు.

పవర్‌ఫుల్ డైలాగులు, భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చి శత్రువులను ఎదుర్కొనే దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రలో మమితా బైజు కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

📢 For Advertisement Booking: 98481 12870