విజువల్ వండర్‌గా పేరుగాంచిన ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం భారత్‌లో ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజమౌళి(Rajamouli) సహా కొంతమంది సినీ ప్రముఖులకు ‘అవతార్ 3’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం జేమ్స్ కామెరూన్, రాజమౌళి వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, ‘అవతార్ 3’ గురించి జేమ్స్ కామెరూన్ (James Cameron) కి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా పండోరా గ్రహంపై ఈసారి కనిపించబోయే కొత్త ప్రపంచం గురించి అడగగా, కామెరూన్ ఎంతో ఉత్సాహంగా వివరించారు. ఈ మూడో భాగంలో నిప్పు, బూడిద నేపథ్యంతో ఉండే కొత్త తెగలు, వారి జీవన విధానం, విజువల్ గ్రాండియర్‌ను ఎలా డిజైన్ చేశారన్న అంశాలను ఆయన రాజమౌళికి వివరించారు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా రూపొందించామన్నారు.
Read also: Tamannaah: బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

రాజమౌళి సెట్‌కు రావాలన్న కామెరూన్
ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా పురోగతి గురించి కామెరూన్ (James Cameron) ఆరా తీశారు. ఇంకా ఏడెనిమిది నెలల షూటింగ్ మిగిలి ఉందని రాజమౌళి చెప్పగా, “నేను మీ సెట్‌కు వచ్చి షూటింగ్ చూడవచ్చా?” అని కామెరూన్ అడిగారు. దీనికి రాజమౌళి బదులిస్తూ, “మీరు రావడం మాకు ఎంతో సంతోషం. మా టీమ్ మాత్రమే కాదు, మొత్తం భారత సినీ పరిశ్రమ థ్రిల్ అవుతుంది” అని అన్నారు. “పులులతో ఏమైనా సన్నివేశాలు తీస్తుంటే చెప్పు, నేనే కెమెరా పట్టుకుని కొన్ని షాట్స్ తీస్తా” అని కామెరూన్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: