టాలీవుడ్‌లో చాలా మంది నాయికలు కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమవడం సాధారణమే. కొందరు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారు; మరికొందరు అవకాశాలు తగ్గడంతో వెనక్కి తగ్గుతారు. కొంతమంది మాత్రం అక్క, వదిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు వరుస సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటి ఇషా చావ్లా(Isha Chawla) మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది.
Read also: Spirit Movie: ఎట్టకేలకు మొదలైన ‘స్పిరిట్’ షూటింగ్

‘ప్రేమ కావాలి’తో మంచి గుర్తింపు
2010లో విడుదలైన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఇషా చావ్లా,(Isha Chawla) ఆ సినిమాతోనే భారీ క్రేజ్ అందుకుంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడటంతో వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. మొత్తం ఐదు తెలుగు సినిమాలు, ఒక కన్నడ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తొలి సినిమా విజయానంతరం ఆ స్థాయి హిట్ అందుకోకపోవడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. 2016 తర్వాత సినిమాల నుంచి దూరమైంది.
చిరంజీవి సినిమాలో భారీ రీఎంట్రీ
చాలా సంవత్సరాల విరామం తర్వాత ఇషా చావ్లా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో ఆమె ముఖ్యపాత్రలో కనిపించనుంది. 2014 తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా, ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో తిరిగి ఫుల్‌ఫ్లెడ్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: