ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBOMMA) ను నిర్వహించిన రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత విచారణ అవసరమని భావించిన పోలీసులు, రవి(IMMADI RAVI)ని కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టును సంప్రదించారు. ఈ అభ్యర్థనపై కోర్టు తాజాగా స్పందించి, అతన్ను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Cleanliness : పరిశుభ్రత చర్యలే అభివృద్ధికి తొలిమెట్టు
మొదట పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, కోర్టు ఐదు రోజులు మాత్రమే అనుమతించింది. ఈ సమయంలో ఐబొమ్మ వెబ్‌సైట్ కార్యకలాపాలు, దాని నెట్‌వర్క్, ఇతర కీలక అంశాలపై పోలీసులు రవిని(IMMADI RAVI) ప్రశ్నించే అవకాశం ఉంది. పైరసీ వ్యవహారంపై మరిన్ని ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: