హాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ సాంకేతికంగా కొత్త ప్రయోగాలతో, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. అందులో ఒక మణి ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ (How To Train Your Dragon). ఈ సినిమాకు డీన్ డెబ్లోయిస్ (Dean DeBlois) దర్శకత్వం వహించగా, ఇది ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్లిన చిత్రంగా నిలిచింది.
Read Also: Nagarjuna: నాగ్ 100 మూవీ నుంచి తప్పుకున్న టబు?
అద్భుతమైన అనిమేషన్, హృదయాన్ని తాకే కథ, రోమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.ఈ నెల 13వ తేదీ నుంచి తెలుగులోను ‘జియో హాట్ స్టార్’ (‘Jio Hot Star’) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
స్టోయిక్ దివాస్ ( గెరార్డ్ బట్లర్) ఒక ఆటవిక తెగకి నాయకుడు. అతని ఒక్కగానొక్క కొడుకే హికప్ (మాసన్ థేమ్స్). స్టోయిక్ అతని గూడెం ప్రజలు తరతరాలుగా ‘డ్రాగన్స్’తో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రాగన్స్ దాడి చేస్తాయో తెలియని ఒక భయానక పరిస్థితులలో వాళ్లంతా రోజులు గడుపుతూ ఉంటారు.
అందువల్లనే టీనేజ్ పిల్లలకి డ్రాగన్స్ (Dragons) ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో శిక్షణ ఇస్తూ ఉంటారు. స్టోయిక్ భార్య .. హికప్ తల్లి కూడా డ్రాగన్స్ బారిన పడుతుంది. అందువలన డ్రాగన్స్ స్థావరం ఎక్కడ ఉందనేది పసిగట్టి, సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలనే పట్టుదలతో స్టోయిక్ ఉంటాడు. తన తరువాత డ్రాగన్స్ పై పోరాడే యోధుడిగా తన కొడుకును తీర్చిదిద్దడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.

కథనం
అలాగే ఒకసారి నైట్ ప్యూరీ అనే డ్రాగన్ ను హికప్ బంధించ గలుగుతాడు. ఆ తరువాత తన కారణంగా అది గాయపడం చూసి జాలిపడి వదిలేస్తాడు. అది తనని ఏమీ చేయకుండా వెళ్లిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక పాత గ్రంథం దొరుకుతుంది. వివిధ రకాల డ్రాగన్స్ ..
వాటి స్వరూప స్వభావాలు .. వాటిని లొంగదీసుకునే తీరును గురించి, అనుభవపూర్వకంగా పూర్వీకులు రాసిన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని పరిశీలించిన హికప్ కి తానేం అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తండ్రికి సపోర్టుగా పోరాడతాడా? లేదంటే డ్రాగన్స్ తరఫున నిలబడతాడా? అనేది మిగతా కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: