సౌత్ ఇండస్ట్రీలో నయనతార (Nayanthara) లేడీ సూపర్ స్టార్‌గా తనదైన ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరనస మన శంకరవరప్రసాద్ గారు చిత్రం (Mana Shankaravaraprasad Garu’s film) లో నటిస్తుంది. అలాగే తమిళంలో అమ్మాన్ 2 చిత్రంలో నటిస్తుంది.
Hindi actress: సంధ్యా శాంతారామ్ కన్నుమూత
డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరు కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా నుంచి నయన్ లుక్ విడుదల చేసారు మేకర్స్.ఇందులో నయనతార ‘శశిరేఖ’ (‘Shashirekha’) అనే పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో నయన్ పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. దీని కోసం ఆమె ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా నయన్ లుక్‌ను రిలీజ్ చేసిన మేకర్స్, ఇటీవల కేరళలో షెడ్యూల్ పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో సాంగ్ షూట్స్ జరుపుతున్నట్టు సమాచారం.
తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో
ఇదిలా ఉంటే, నయనతార తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమ్మాన్ 2’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె మళ్లీ అమ్మవారి పాత్రలో దర్శనమివ్వనుంది. మీనా, రెజీనా, యోగి బాబు (Yogi Babu) తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తరపున డాక్టర్ ఐషరీ కె. గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు మీనా, రెజీనా, యోగి బాబు తదితరులు కూడా పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు నయన్ రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: