హాలీవుడ్‌లో తనకంటూ, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జపాన్ మూలాలున్న అమెరికన్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా (75) (Cary-Hiroyuki Tagawa) ఇకలేరు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో, ఆయన కన్నుమూశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.. ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో తనదైన స్థానం ఏర్పరచుకున్న తగావా, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
Read Also: Akhanda 2 box office impact : ‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు
(Cary-Hiroyuki Tagawa) ఆయన మరణ వార్త హాలీవుడ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినీప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లోనే ఆయన ఎక్కువగా నటించారు..
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: