కార్తి (Karthi) హీరోగా నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వా వాతియార్ ’ సినిమా, కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ‘వా వాతియార్’గా, తెలుగులో ‘అన్నగారు వస్తారు ’ పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌లో కార్తీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు వచ్చిన హిట్ ప్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనును హిట్ 4 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందని అడిగాడు కార్తీ (Karthi).
Read Also: Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్…

దీనికి శైలేష్ కొలను (నవ్వుతూ) స్పందిస్తూ.. నేను ఇంకా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నా. కథ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలన్నాడు. శైలేష్ కొలను తాజా కామెంట్స్‌తో హిట్ ప్రాంచైజీలో రాబోయే నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్‌పై మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది. హిట్ 3లో కార్తీ కామియో అప్పీయరెన్స్‌లో కనిపించాడు. మరి హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనును ఓపెన్‌గా అడిగే సరికి నాలుగో పార్ట్‌లో లీడ్ రోల్ చేసేది కార్తీనే అయి ఉంటుందని అంతా తెగ చర్చించుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: