టాలీవుడ్‌లో యాంగ్రీ స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజశేఖర్ (Rajasekhar). డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ సాలిడ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మాస్ ప్రేక్షకులకు తన ఆవేశభరిత నటనతో, వేరియేషన్ పాత్రలతో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు అందించిన ఆయన వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. హీరోగా అయినా, కీలక పాత్రల్లో అయినా తనదైన పాత్రకు న్యాయం చేసే నటుడిగా రాజశేఖర్ (Rajasekhar) కు సినీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
Read Also: Johnny Master: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఘన విజయం

4 వారాలు విశ్రాంతి
తాజాగా రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: