ప్రముఖ దక్షిణాది హీరో అబ్బాస్ ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన వ్యక్తి.‘ప్రేమదేశం’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో తన అందం నటనతో ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.90వ దశకంలో యువకుల అభిమాన హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ వన్-ఆఫ్-ది-కైండ్ లవర్ బాయ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. కానీ తరువాతి కాలంలో అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.అబ్బాస్ 1975 మే 21న కోల్‌కతాలో జన్మించారు. ముంబైలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ హీరో తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టాడు. 1996లో ‘కాదల్ దేశం'(తెలుగులో ప్రేమదేశం) సినిమాతో హీరోగా అంగీకరించాడు.
మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమాలో అబ్బాస్ తో పాటు వినీత్ హీరోగా నటించారు.టబు కథానాయికగా నటించి, వడివేలు కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా ప్రేమ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అప్పట్లో అబ్బాస్ కి తన యాక్టింగ్, లుక్స్, హెయిర్ స్టైల్‌కు ఒక ప్రత్యేకమైన అభిమానుల బేస్ ఉండేది. 1997లో, ‘VIP’ అనే చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించాడు.అబ్బాస్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు.
90లలో అబ్బాస్ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా నిలిచాడు.కానీ తరువాతి కాలంలో అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో,అబ్బాస్ క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది.ఈ సమయంలో అతడు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం ప్రారంభించాడు. 2015 నుండి, అబ్బాస్ సినిమాలకు దూరంగా ఉన్నారు.కొంతకాలం తర్వాత, అతడు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో నివసించసాగాడు.ఇటీవల, అతడు సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చి, తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టాడు.
తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ తన రీఎంట్రీపై ఓ అద్భుతమైన వార్త ప్రకటించారు.అందు మేరకు దాదాపు పదేళ్ల తర్వాత, అబ్బాస్ తన సినిమా కెరీర్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ‘విక్రమ్ వేద’ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించబోతున్నారని వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు పూర్తి వివరాలు బయట రాలేదు ఇక అబ్బాస్ రీఎంట్రీ విషయంలో అభిమానులు ఎంతో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆయన తిరిగి పరిశ్రమలో అడుగుపెడితే మళ్లీ అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందగలుగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.