
Hello Bachhon: వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హలో బచ్చో’ (Hello Bachhon) వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్స్ గా ‘ప్రతీశ్ మెహతా ‘ రూపొందించిన ఈ సిరీస్ ఈ నెల 6వ తేదీ నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: Funky Movie: ఫంకీ ఓటీటీ డేట్ ఫిక్స్
కథ
అలఖ్ పాండే (వినీత్ కుమార్ సింగ్) అలహాబాద్ కి చెందిన ఓ యువకుడు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఈ యువకుడు చదువులలో మొదటి నుంచి మంచి ప్రతిభను కనబరుస్తాడు. అయితే తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లడానికి ఆయన ఎన్నో కష్టాలను పడవలసి వస్తుంది. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. విద్యా వ్యవస్థలోని సమస్యలు ఆయనను ఎంతో ప్రభావితం చేస్తాయి.
అలఖ్ పాండే స్టూడెంట్స్ ను చైతన్య పరచడంలో సక్సెస్ అవుతాడు. ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు .. తేలికగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పే తీరు పిల్లలకి విపరీతంగా నచ్చుతుంది. ఒకానొక సమయంలో ఆయనకి పెద్ద మొత్తంలో ఫండింగ్ అవసరమవుతుంది. అదే సమయంలో ఆయనకి కుటుంబం వైపు నుంచి, ఇనిస్టిట్యూట్ వైపు నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. తాను అనుకున్న లక్ష్యం వైపు నుంచి తప్పుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అవరోధాలను ఎలా ఎదుర్కున్నాడు? అనేదే కథ.
విశ్లేషణ
ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో స్టూడెంట్ జీవితాన్ని పరిచయం చేశారని అనుకోవాలి. చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డుకాకూడదు .. ఆంక్షల పేరుతో ఆడపిల్లలు చదువుకి దూరం కాకూడదు. రెండు గోల్స్ పెట్టుకుని, రెండు పడవలపై ప్రయాణం చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని చదువుతూ ఎదగాలి. అలాగే ర్యాంక్ కోసం పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయకూడదు.. చదువు మాత్రమే బతుకులను బాగు చేయగలదు అనే అంశాలను టచ్ చేసిన విధానం మనసుకు హత్తుకుంటుంది.
అయితే ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకూ ఉంది. ఫండింగ్ కోసం ప్రయత్నాలు చేయడం .. ఆ విషయాన్ని గురించి చర్చించుకోవడం వంటి అంశాలకు సంబంధించిన సన్నివేశాల కోసం, కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేదేమో అనే భావన కలుగుతుంది. అక్కడక్కడా కాస్త సాగతీతగా అనిపించినప్పటికీ, స్టూడెంట్స్ తప్పకుండా చూడాల్సిన కంటెంట్ అనే చెప్పుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: