పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌కు పునాది వేసిన హరిహర వీరమల్లు: రిలీజ్ డేట్ ఫిక్స్, బుర్జ్ ఖలీఫా ప్రమోషన్‌తో సెన్సేషన్
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలకు తావిచ్చే చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలలో “హరిహర వీరమల్లు” ఒకటి. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ (Periodic action adventure) సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ చిత్రం తొలి భాగానికి సంబంధించిన టైటిల్‌ను ‘హరిహర వీరమల్లు పార్ట్ -1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా అధికారికంగా ప్రకటించడంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. జూన్ 12న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ పరిశ్రమలో విశేషమైన ఆసక్తి నెలకొని ఉంది. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా గ్లోబల్ లెవెల్‌లో (global level) నే ఈ సినిమా ప్రమోషన్ చేయాలన్నది మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

షూటింగ్ కంప్లీట్ – పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా టీమ్
ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. భారీ సెట్‌లు, విస్తృత లొకేషన్లలో షూటింగ్ జరిపిన హరిహర వీరమల్లు టీమ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్ తదితర అంశాలలో ఎటువంటి రాజీ లేకుండా మేకింగ్‌ను మెరుగుపరిచే దిశగా చిత్రబృందం కృషి చేస్తోంది. ప్రేక్షకులకు విజువల్ గా కొత్త అనుభూతిని కలిగించేలా ఫైనల్ ఔట్‌పుట్‌ను సిద్ధం చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.
టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా ప్రమోషన్
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవడానికి ముహూర్తం ఖరారైంది. ప్రత్యేకంగా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్న మేకర్స్, సినిమా ట్రైలర్‌ను దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుర్జ్ ఖలీఫా టవర్‌పై రిలీజ్ చేయాలని సంకల్పించారు. ఇది సాధ్యమైనట్లయితే, టాలీవుడ్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి సినిమా హరిహర వీరమల్లు అవుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ మాత్రమే బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించబడింది. ఆ తరహాలో ఇప్పుడు తెలుగు సినిమా ట్రైలర్‌ను అక్కడ ప్రదర్శించడం విశేషమే. ఇది కేవలం ప్రమోషన్ మాత్రమే కాదు, టాలీవుడ్ స్థాయిని, మార్కెట్ పరిధిని ప్రపంచానికి చాటే అవకాశం కూడా.
విప్లవాత్మక కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలవబోతోన్న ‘హరిహర వీరమల్లు’
చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఆసక్తికర కథతో పాటు సమకాలీన సాంకేతికతను సమన్వయం చేస్తూ రూపుదిద్దుకుంటోంది. “పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండటం మరో హైలైట్. పవన్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. కథ, పాత్రలు, సెటింగ్, డైలాగ్స్ అన్నీ ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతున్నాయి.
Read also: Telugu Movie: చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమా ఏదో తెలుసా?