తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ పేరు వినిపించగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎన్నో మాస్ బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతూ కెరీర్‌లో చివరి సినిమాగా ‘ జన నాయగన్ ’ను చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
Read Also: Akhil Raj: హీరోగా మరో ఛాన్స్ దక్కించుకున్న అఖిల్ రాజ్
రీమేక్ రూమర్లకు చెక్
ఈ మూవీలో విజయ్ నిజాయితీగల పోలీస్ అధికారిగా కనిపించి, సమాజంలోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో, పూజా హెగ్డే, మలయాళం బ్యూటీ మమిత బైజు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinod) స్పష్టత ఇచ్చారు. మలేషియాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘ఇది 100 శాతం దలపతి విజయ్ సినిమా. థియేటర్లలో అభిమానులకు ఇది ఒక భారీ కమర్షియల్ ట్రీట్‌గా నిలుస్తుంది’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రీమేక్ రూమర్లకు తెరపడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: