మాళవిక మోహనన్ Geece గ్రీస్‌లో ‘రాజా సాబ్’ వైబ్స్ – ప్రభాస్ సినిమాపై హైప్ పెరిగింది! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యూనిట్ గ్రీస్‌లో మిగిలిన రెండు పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సందర్భంలో హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika mohan) సోషల్ మీడియాలో హీట్ చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన తాజా ఫోటోలో, ‘ది రాజా సాబ్’ పోస్టర్‌తో ప్రింట్ చేసిన డ్రెస్ ధరించి కనిపించారు. “Lights, Camera, Greece!” అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోను పోస్ట్ చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దానికి ఒక రోజు ముందే దర్శకుడు మారుతి కూడా సినిమా పోస్టర్ ఉన్న టీ-షర్ట్‌లో ఫోటో షేర్ చేశారు. ఇద్దరూ వరుసగా ఇలాగే పోస్టులు చేయడంతో సినిమాపై ప్రమోషనల్ హైప్ మరింత పెరిగింది.
Upasana: నేనేమీ అథ్లెట్ ను కాను: ఉపాసన

Geece
Geece ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయి, డబ్బింగ్ కూడా దాదాపు ముగిసింది. పాటల షూటింగ్ పూర్తయిన వెంటనే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ కానుంది. దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్ డ్యాన్స్ ఎనర్జీపై ప్రశంసలు కురిపించారు. ‘బాహుబలి’లో (Baahubali) కట్టప్ప పాదాలను బాహుబలి తలపై పెట్టుకునే ప్రసిద్ధ సీన్ ఫోటోను పోస్ట్ చేస్తూ, “నా డార్లింగ్ ప్రభాస్ ఎనర్జీని చూస్తుంటే ఇదే గుర్తొచ్చింది” అని వ్యాఖ్యానించారు. ‘ది రాజా సాబ్’ ప్రభాస్ కెరీర్‌లో ఫుల్-ఫ్లెజ్డ్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను గగనానికి చేర్చింది. తొలుత డిసెంబర్ 5న విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడు తాజా ప్రకటన ప్రకారం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు.
‘ది రాజా సాబ్’ షూటింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది?
సమాధానం: ప్రస్తుతం గ్రీస్‌లో చివరి రెండు పాటల చిత్రీకరణ జరుగుతోంది.
ప్రశ్న: సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
సమాధానం: ‘ది రాజా సాబ్’ను 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: