Gaddar Award: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. సినీ పరిశ్రమలో ప్రతిభను, కష్టాన్ని గుర్తించి గౌరవించడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. నన్ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జ్యూరీ సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణంలో ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నాకు కొండంత బలం” అని అన్నారు..
Read Also: Dhurandhar 2 Movie: 10 కోట్లు ‘ధురంధర్ 2 దాటిన అడ్వాన్స్ బుకింగ్స్

ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు
కాగా, శనివారం ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది ప్రత్యేక పురస్కారాల్లో చిరంజీవితో పాటు పలువురు దిగ్గజాలకు అవార్డులు దక్కాయి. కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ అవార్డు, జయసుధకు అక్కినేని అవార్డు, నిర్మాత అశ్వినీదత్‌కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులు ప్రకటించారు. అలాగే సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్.రెడ్డి అవార్డు, రమేష్ ప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డులు లభించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: