हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Funky Movie Review: విశ్వ‌క్‌సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే?

Anusha
Funky Movie Review: విశ్వ‌క్‌సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో వెరైటీ కామెడీ శైలితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ కె.వి. తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఫంకీ’ (Funky Movie Review). ఇప్పటికే ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల్ని నవ్వించిన అనుదీప్, ఈసారి మరో కొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చారు. ఈ సినిమాలో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ , కయాదు లోహర్ జంటగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

Read Also: Threat: రణ్‌వీర్‌ సింగ్‌, రోహిత్‌ శెట్టికి చంపేస్తామంటూ బెదిరింపులు?

‘ఫంకీ’ ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దర్శకుడు అనుదీప్ మాత్రం ఇది ‘జాతిరత్నాలు’ తరహా సినిమా కాదని, పూర్తిగా భిన్నమైన కథ అని స్పష్టం చేశారు. యువ దర్శకుడి చుట్టూ తిరిగే కథలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, వినోదం అన్నీ సమతుల్యంగా ఉంటాయని ఆయన తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్‌తో ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘ఫంకీ’ (Funky Movie Review) రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం..

Funky Movie Review
Funky Movie Review

కథ

కోమల్‌ (విశ్వక్‌సేన్‌) దర్శకుడిగా తొలి సినిమా చేస్తుంటాడు. అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెంచేయడంతో అవకాశం ఇచ్చిన నిర్మాత అనారోగ్యపాలవుతాడు. తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన కోమల్‌పై నిర్మాత కూతురు చిత్ర (కయాదు లోహర్‌) కి చెప్పలేనంత కోపం వస్తుంది. కోమల్‌ని దర్శకుడిగా తీసేస్తుంది. సినిమా ఆపేస్తుంది. ఇక ఎలాగొలా చిత్ర, కోపాన్ని తగ్గించి సినిమాలు మళ్లీ మొదలుపెట్టాలని కోమల్‌ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ఓ దశలో చిత్ర ఒప్పుకుంటుంది.

మిగిలిన సినిమాను తాను చెబుతున్న బడ్జెట్‌లో కాకుండా కేవలం కోటి రూపాయల్లో పూర్తి చేయాలనే షరతుతో సినిమాను మళ్లీ మొదలు పెడుతుంది చిత్ర. ఈ ప్రయాణంలో కోమల్‌, చిత్ర మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంతకీ కోమల్‌ అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తి చేయగలిగాడా? నిర్మాత కుమార్తె చిత్రను పెళ్లాడగలిగాడా? సినిమా తెరకెక్కించే క్రమంలో కోమల్‌కు ఎదురైన సమస్యలేంటి? వాటిని తను ఎలా అధిగమించాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

విశ్లేషణ

దర్శకుడు అనుదీప్‌ కేవలం నవ్వించడానికే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ.. సినిమానే కామెడీ కాకూడదు. ఓ సింపుల్‌ లైన్‌ని సినిమాగా తీసుకొని ఫన్‌ మోడ్‌లో సినిమా అంతటినీ నడిపించాడు దర్శకుడు అనుదీప్‌. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో పాటు మధ్య వచ్చి వెళ్లిపోయే పాత్రలు సైతం సైటైర్లు వేస్తుంటాయి. దీనికోసం దర్శకుడు రాసుకున్న ఫన్నీ వన్‌లైనర్లు కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఈ కథలో హీరోయిన్‌ని హీరో ప్రేమిస్తాడు. కానీ అమ్మతో కాసేపు ఫోన్లో మాట్లాడటాన్ని మాత్రం గలీజుగా ఫీలవుతాడు. బంధాలంటే అతనికి గలీజు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870