తమిళనాడు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను ‘కలైమామణి’ (Kalaimamani Award) పురస్కారంతో సత్కరిస్తూ వస్తోంది. ఈ అవార్డు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరపున కళా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందజేయబడుతుంది. తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకుగాను కలైమామణి పురస్కార గ్రహీతలను ప్రకటించి, చెన్నైలోని వాణి మహల్‌లో శనివారం సాయంత్రం ఘనంగా ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.
K-Ramp Movie: కె- ర్యాంప్ ట్రైలర్ విడుదల
ఈ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin), ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udayanidhi Stalin) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 90 మంది కళాకారులు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.
నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు, నృత్య కళాకారులు వంటి విభిన్న విభాగాల వారు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.2021కిగానూ నటనా విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) రాష్ట్ర సీఎం స్టాలిని చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే 2023 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నటుడు కె మణికందన్ అవార్డును గెలుచుకున్నారు.
ఎస్.జె. సూర్య కూడా ఉత్తమ నటుడిగా
విక్రమ్ ప్రభు, ఎస్.జె. సూర్య కూడా ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఉత్తమ సంగీత స్వరకర్త అవార్డును అనిరుధ్ రవిచందర్ కు ప్రదానం చేశారు.
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా సంగీత స్వరకర్త అనిరుధ్ ఈ అవార్డును అందుకున్నారు.కలైమామణి అవార్డు (Kalaimamani Award) కు దర్శకుడు ఎన్. లింగుసామి, గాయని సుజాత మోహన్ సహా వివిధ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంగీతానికి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డును గాయకుడు కె.జె. యేసుదాస్‌కు ప్రదానం చేశారు. దాదాపు మూడేళ్లకు గానూ మొత్తం 90 మందికి ఈ పురస్కారాలను అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: