తెలుగు సినీ పరిశ్రమలో, పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (IBomma) హోల్ అండ్ సోల్ ఓనర్ ,రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.సినిమాలు (Movies) విడుదలైన రోజునే హై క్వాలిటీ ప్రింట్‌ను అప్‌లోడ్ చేస్తూ నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ ఎన్నోసార్లు కోరింది. చివరికి రవిని అరెస్ట్ చేయడంతో పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
Read Also: Bigg Boss 9: రీతూకి నాగార్జున బంపర్ ఆఫర్

సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు
అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెట్టి శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే, 14 రోజుల రిమాండ్ విధించారు. 7 రోజుల కస్టడీని కోరి, పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు..? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు..? ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు ఉన్నారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: