టాలీవుడ్‌లో యువ దర్శకుడిగా గుర్తింపు పొందిన రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ (‘Radheshyam’) వంటి పాన్-ఇండియా చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణ తల్లి రమణి(60) మృతి చెందారు. ఈ నెల 15వ తేదీనే ఆమె తుదిశ్వాస విడవగా, ఈ విషయాన్ని రాధాకృష్ణ (Radha Krishna Kumar) తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Read Also: IMMADI RAVI: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీలోకి
సినీ ప్రముఖుల సానుభూతి
ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తల్లిని గుర్తుచేసుకుంటూ రాధాకృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావు. నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్లిపోయావు. నీతో ఇన్నాళ్లు బతికిన జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మా…! నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా మై ఫస్ట్ లవ్” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: