ఒకవైపు సంగీతం RRR Concert మరోవైపు అభిమానుల జోష్. ఇదీ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ‘RRR’ లైవ్ కాన్సర్ట్ అట్మాస్ఫియర్. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండుగే అయింది.వేదికపై ఎన్టీఆర్, చరణ్ కలిసి కనిపించిన ప్రతి క్షణం ఫ్యాన్స్‌కు గోలే గోల. ఆత్మీయతతో ఓ దృశ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను హత్తుకుని, ముద్దు పెట్టడం వైరల్ అయింది. వారిద్దరి మధ్య గల స్నేహం అందరినీ ఆకట్టుకుంది.

అభిమానుల అతి ఉత్సాహానికి తారక్ అసహనం
ఈ వేడుకలో అభిమానుల ఓవర్ ఎక్సైట్మెంట్ కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హాల్ వెలుపల సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ చుట్టూ గుంపులుగా చేరారు. అయితే, తారక్‌కు ఇది అసౌకర్యంగా మారింది.అతను షాంతిగా భద్రతా సిబ్బంది సహాయంతో ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయమన్నాడు. కానీ ఎవ్వరూ వినకపోవడంతో ఎన్టీఆర్ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోవాల్సి వచ్చింది.
వైరల్ వీడియోలో తారక్ మాటలు
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎంతో ఓపికగా ఇలా చెప్పినట్టు వినిపిస్తుంది –నాకు మీతో సెల్ఫీలు కావాలి. కానీ, ఒక్కసారి లైన్లో నిలబడి రOడి. లేకపోతే భద్రతా సిబ్బంది మిమ్మల్ని బయటకు పంపుతారు.అయినా అభిమానులు వినకపోవడం వల్ల ఎన్టీఆర్ నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తారక్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఆయన ఓపికను, అభిమానుల పట్ల ప్రేమను అభినందిస్తున్నారు.
తారక్ రియాక్షన్‌పై మిశ్రమ స్పందన
ఇంకొంతమంది ఫ్యాన్స్ మాత్రం తమ ప్రేమను ఇలా చూపించాల్సిందే అంటున్నారు. కానీ, భద్రత, ఇతరుల హక్కులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.కన్సర్ట్‌లో ఎంఎం కీరవాణి స్వరాలు హాలును శబ్దంతో ముంచాయి. RRR సాంగ్స్ లైవ్ పర్ఫామెన్స్‌తో అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాయి. చరణ్, తారక్ పర్సనాలిటీ హాల్‌ను హీట్ చేసింది. ఎక్కడ చూసినా వాళ్లకు గోలే గోల.
Read Also : Javed Akhtar: బాలీవుడ్ పై జావేద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు