ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) నివాసం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram, Haryana)లో ఆయన ఇంటిపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఉదయం బైక్‌పై దుండగుల దాడి
ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో ముగ్గురు దుండగులు (Three attackers)బైక్‌పై అక్కడికి చేరుకుని ఎల్విష్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. వారు దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపిన తర్వాత పరారయ్యారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఘటన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేరు
కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) (Elvish Yadav) హర్యానా వెలుపల పనిమీద ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్‌టేకర్ మాత్రం భవనంలోనే ఉన్నారు. ఈ ఇంటి రెండో, మూడో అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటుందని అధికారులు తెలిపారు.
పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలన
సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాంతాన్ని ముట్టడించారు. సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది.
సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు
దుండగులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయలేదని సమాచారం. దుండగులు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే అంశంపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: