ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాతో జపాన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రభాస్‌కు అక్కడి అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం (The film ‘Baahubali: The Epic’) ఈ నెల 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభాస్ అక్కడికి వెళ్లారు. జపాన్ అభిమానులతో కలిసి ఆయన సందడి చేస్తూ, ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు.
Read Also: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
ఎలాంటి ఆందోళన అవసరం లేదు
అయితే ప్రభాస్ (Prabhas) జపాన్‌లో ఉన్న సమయంలోనే అక్కడ భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ప్రభాస్‌తో పాటు అతడి బృందం పూర్తిగా సురక్షితంగా ఉన్నారని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు మారుతి తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
“ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అంటూ మారుతి రిప్లై ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు అభిమానులు మారుతికి ధన్యవాదాలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: