టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) మరోసారి తన అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తన ఉత్సాహం, ఎనర్జీ, ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న రవితేజ. ఆయన నటించిన తాజా చిత్రం “మాస్ జాతర” అక్టోబర్ 31న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also: Dil Raju: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు సినిమా?
భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రవితేజ సిగ్నేచర్ మాస్ ఎనర్జీతో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఉండబోతోందని సినిమా యూనిట్ చెబుతోంది.
యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా తెరకెక్కించినట్లు చెబుతూ మేకర్స్ హైప్ పెంచేస్తున్నారు.‘మాస్ జాతర’ (Mass Jathara Movie) రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రవితేజ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్ర విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

నాకు చాలా ఇష్టమైన సినిమా ‘ఈగల్’
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రత్యేకంగా నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కెరీర్‌లో నాకు చాలా ఇష్టమైన సినిమా ‘ఈగల్’ (Eagle Movie). అందులో నేను చేసిన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.కానీ ప్రేక్షకులు ఆ సినిమా ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు.
కాన్సెప్ట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే కొంచెం క్లిష్టంగా ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ కావడం కష్టమైంది. అదే కథను సింపుల్‌గా చెప్పి ఉంటే బ్లాక్‌బస్టర్ అయేది’. ‘నా ఆటోగ్రాఫ్ మెమోరీస్ సినిమా (Naa Autograph Movie) కూడా నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.
కానీ అప్పట్లో పెద్దగా ఆడలేదు. అలాగే నేనింతే కూడా ఆ సమయంలో ఫెయిల్ అయింది.కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు క్లాసిక్స్‌గా గుర్తింపు పొందాయి’’ అని రవితేజ (Ravi Teja) చెప్పారు. కాలం మారిన కొద్దీ మంచి సినిమాలు విలువ పొందుతాయని, ‘ఈగల్’ కూడా ఒక రోజు క్లాసిక్‌గా మారుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: