విజయదశమి Dussehra సందర్భంగా వరుణ్ తేజ్–లావణ్య దంపతులు తమ కుమారుడి పేరును ప్రకటించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు విజయదశమి పర్వదినం నాడు తమ పుత్రుని నామకరణం చేశారు. చిన్నారికి “వాయువ్ తేజ్ కొణిదెల” (Vaayuv Tej Konidela) అని పేరు పెట్టినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్న వరుణ్ తేజ్ – “మా జీవితాల్లోకి వచ్చిన గొప్ప ఆశీర్వాదానికి ఇప్పుడు ఒక ప్రత్యేక పేరు వచ్చింది” అని పేర్కొన్నారు.
nayanika: అల్లు శిరీశ్ నయనికతో నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు

Vaayuv Tej Konidela
వాయువ్” అంటే
ఈ పేరులోని అర్థం కూడా ప్రత్యేకమే. “వాయువ్” అంటే ఆగని శక్తి, ధైర్యం, భక్తి, ఆధ్యాత్మిక తేజస్సు అని దంపతులు తెలిపారు. హనుమంతుడి స్ఫూర్తితోనే ఈ పేరు పెట్టినట్లు వివరించారు. గత సెప్టెంబర్ 10న లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ శుభసమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి మనవడిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ జంట గతేడాది నవంబర్ 1న ఇటలీ టస్కనాలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. Vayuv Tej Konidela ప్రస్తుతం “వాయువ్ తేజ్” పేరును ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, కొణిదెల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరుణ్ తేజ్–లావణ్య దంపతుల కుమారుడి పేరు ఏమిటి?
వారి కుమారుడికి వాయువ్ తేజ్ కొణిదెల (Vaayuv Tej Konidela) అనే పేరు పెట్టారు.
ఈ పేరు ఎప్పుడు ప్రకటించారు?
విజయదశమి పర్వదినం సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: