కొత్త సంవత్సరం 2026లో అల్లు అరవింద్, అల్లు అర్జున్(Allu Arjun) ఏషియన్ సినిమాస్‌తో కలిసి కోకాపేట్‌లో ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను జనవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ని (Dolby Screen) అల్లు సినీప్లెక్స్ సిద్ధం చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కోకాపేటలో ఉన్న ఈ 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ డిసిఐ ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో పనిచేస్తుందని, ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డి ప్రొజెక్షన్ సాంకేతికతో విజువల్స్ ఆకర్షిస్తాయని చెబుతున్నారు. అత్యాధునిక డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ క్రేజ్ పెంచుతుంది. ధ్వని- వీక్షణ పరంగా 3డి, 2డి సినిమాల వీక్షణకు అత్యుత్తమ అనుభవాన్ని కోకాపేట్ థియేటర్ అందించగలదని చెబుతున్నారు.
సంక్రాంతి 2026కి గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని కూడా చెబుతున్నారు. అల్లు సినీప్లెక్స్ భారతదేశంలోని ఆరు డాల్బీ సినిమా ఇన్‌స్టాలేషన్‌లలో ఒకటిగా మారనుంది. (Dolby Screen) ఈ థియేటర్ ప్రపంచస్థాయి వీక్షణ అనుభవాన్ని అందించనుంది. ఇకపైనా విడుదలకు వచ్చే భారీ హాలీవుడ్ చిత్రాలతో పాటు, నితీష్ తివారీ- రామాయణం, రాజమౌళి – వారణాసి వంటి చిత్రాలను ఇలాంటి యూనిక్ సౌండ్ క్వాలిటీ వున్న థియేటర్లలో వీక్షిస్తే ఆ అనుభవం వేరేగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read also: Kiran Abbavaram: సమ్మర్ లో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: