సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా, ‘కలర్ ఫోటో’ ఫేం సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోగ్లీ ’ సినిమాని (‘Mowgli’ movie) ,మొదట డిసెంబర్ 12న విడుదల చేయాలని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించారు. పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే ఏర్పడ్డాయి. అయితే, సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని సందీప్ రాజ్ (Sandeep Raj) తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also: Nivetha Pethuraj: ఎంగేజ్‌మెంట్ ఫొటోలు తొలగించిన నివేదా!
‘మోగ్లీ’ వాయిదా వార్తల నేపథ్యంలో దర్శకుడు సందీప్ రాజ్ చేసిన భావోద్వేగ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి తెలుగు సినిమా ఏది?
సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి తెలుగు సినిమా ‘కలర్ ఫోటో’ (Color Photo).
‘కలర్ ఫోటో’ ఏ సంవత్సరం విడుదలైంది?
ఈ చిత్రం 2020లో విడుదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: