బాలీవుడ్ మసాలా హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీర్‌లో ఇప్పుడు ఓ కొత్త మలుపు రానుంది. ఒకప్పుడు హిట్‌మెషీన్‌గా పేరొందిన ఈ స్టార్ గత కొన్నేళ్లుగా తన సినిమాలతో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.తాజాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సికిందర్ భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో సల్మాన్‌కు పెద్ద షాక్ తగిలింది.
Bigg Boss 9: హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజ ఔట్
ఇకపోతే, ఈ దెబ్బతో మళ్లీ తన సత్తా చాటాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్‌లో కాస్త వెనుకబడిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ వైపు దృష్టి సారించాడు. ప్రస్తుతం దక్షిణాది సినిమా మార్కెట్ జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న వేళ, తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) లో భారీ బడ్జెట్ సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ కూడా తెలుగు సినిమా బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుతో ఆయన చేతులు కలపబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌లో సల్మాన్ నటించబోయే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే చర్చలు పూర్తి దశకు చేరుకున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఇప్పుడు సల్మాన్‌తో కలిసి పాన్ ఇండియా
వంశీ పైడిపల్లి, మహేష్ బాబు నటించిన మహర్షి, విజయ్ నటించిన వరసుడు వంటి చిత్రాలతో తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు సల్మాన్‌తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. 18 ఏళ్ల కెరీర్లో వంశీ పైడిపల్లి తీసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే.
ఇందులో ఐదు చిత్రాలకు దిల్ రాజే నిర్మాత. సినిమాలు తక్కువే అయినా వంశీ (Vamsi Paidipally,) కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ఖాన్‌తో తాను తీయబోయే చిత్రానికి వంశీ పైడిపల్లిని డైరెక్టర్‌గా సెలక్ట్ చేసుకున్నారట దిల్ రాజు.
ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను
వంశీ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన సల్మాన్ మూవీ చేద్దామని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.నిర్మాతగా దిల్ రాజు (Dil Raju) ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. సంక్రాంతి సీజన్‌లో ఎన్నో అంచనాలతో రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిజాస్టర్ కావడం.
తో దిల్ రాజు బాగా నష్టపోయారు. అయితే వెంటనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆయనకు ఊపిరి ఇచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’కి వచ్చిన లాభాలతో పోలిస్తే ‘గేమ్ ఛేంజర్’కి వచ్చిన నష్టాలు ఇంకా ఎక్కువేనని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: