ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ధురంధర్’ చిత్రం (Dhurandhar Movie) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించి, వరుసగా రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే, అందులోని రాజకీయ అంశాలతో తాను ఏకీభవించలేనని చెప్పడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాపై హృతిక్ స్పందిస్తూ, “నాకు ‘ధురంధర్’ (Dhurandhar Movie) చాలా నచ్చింది.
Read Also: Ram: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా ఎప్పుడంటే?
రాజకీయపరమైన అంశాలను నేను అంగీకరించలేకపోతున్నా
ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు అందించిన చిత్ర బృందానికి నా అభినందనలు. కథను తెరకెక్కించిన విధానం, హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అయితే, ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను నేను అంగీకరించలేకపోతున్నా. బహుశా దర్శకులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అలా రూపొందించారని భావిస్తున్నా. ఒక పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఈ చిత్రాన్ని ఎంతో ఆస్వాదించాను,
)
ఎన్నో విషయాలు నేర్చుకున్నాను” అని అన్నారు.హృతిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ధురంధర్’ చిత్రంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని, వారి దాడుల భయానకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, ఆ వాస్తవాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను చూపించడాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
హృతిక్ రోషన్ తొలి సినిమా ఏది?
హృతిక్ రోషన్ తొలి హీరో సినిమా “కహో నా… ప్యార్ హై” (2000).
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: