ప్రస్తుతం మొత్తం ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రమే “ధురంధర్” (Dhurandhar Movie). ఇండియా(India) లో విడుదలైన 15 రోజుల్లోనే రూ.500Cr కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లోనూ 3వ స్థానానికి చేరింది. తొలి 2 స్థానాల్లో కాంతార ఛాప్టర్-1(రూ.622Cr), ఛావా(601Cr) ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.700Cr రాబట్టింది.
Read also: Gurram Paapi Reddy Movie Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దురంధుర్’..
దురంధుర్ దూకుడు చూస్తుంటే వచ్చే వారంలో ఈరెండు సినిమాలను దాటేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది. (Dhurandhar Movie) అంతేకాదు ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈసినిమా ఇప్పటివరకు 10 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది. దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణ్ వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో వేగంగా రూ.500 కోట్లు వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా రికార్డు కెక్కింది. స్పై జానర్లో వచ్చిన ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈసినిమా తెలుగులోనూ విడుదలకానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: