తమిళ సినీ పరిశ్రమలో యువ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు నేరుగా టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్, మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్న ఆయన, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతున్నారు.
Read Also: Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు
తెరకెక్కించే ప్లాన్
ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే తమిళంలో ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధ్రువ్ విక్రమ్, తన తదుపరి అడుగును తెలుగులో వేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కనుందని సమాచారం.ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నది షార్ట్ ఫిల్మ్ ‘మనసానమహ’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు దీపక్ రెడ్డి.

కొత్త తరహా ప్రేమకథతో వినోదాన్ని మిళితం చేసే కథను సిద్ధం చేసిన ఆయనకు ధ్రువ్ విక్రమ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. సంగీత దర్శకుడిగా యువ టాలెంట్ సాయి అభ్యంకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ కామెడీకి తగినట్లుగా మ్యూజిక్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: