సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా(Aha) ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకువచ్చింది. ఆ సిరీస్ పేరు ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘. ప్రస్తుతం ఈ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు కీలకపాత్రలు పోషించారు. అలాగే జెస్విని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పుడు డిసెంబర్ 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘ సిరీస్ అందుబాటులో ఉంది.ఇంతవరకూ వదిలిన 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
Read also: Oscars: యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

కథ
‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ పరిధిలో దసరా నవరాత్రులకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రి మారన్ (అశ్విన్) వస్తాడు. అక్కడ రాజకీయాల ముసుగులో ఏ స్థాయిలో రాక్షసత్వం ఉందనేది వెట్రి మారన్ కి తెలుసు. అదే పోలీస్ స్టేషన్ లో మాసాని (పదినే కుమార్) కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటుంది. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. మూడు హత్యలు జరగనున్న విషయం కూడా ఆమెకి అలాగే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తనతో పాటు పనిచేస్తున్న మిగతా పోలీస్ లకు చెబుతుంది. ఆమెకి అలా అనిపించిందంటే తప్పకుండా జరుగుతుందని తెలిసి ఉండటం వలన, వాళ్లంతా కూడా ఆందోళన చెందుతారు.(Dhoolpet Police Station) ఎందుకంటే ‘ధూల్ పేట్ శంకర్’ కి చెందిన మనుషులు శత్రువులపై పగ తీర్చుకునే పనిలో ఉన్నారనే విషయం వాళ్లకి తెలుసు.
ఊహించినట్టుగా ఆ ఊళ్లో మూడు హత్యలు జరుగుతాయి. ఆ ముగ్గురులో ‘ఉమాపతి’ కూతురు ‘సంధ్య’ కూడా ఉండటంతో ఊరంతా ఉలిక్కి పడుతుంది. సంధ్య బంగారు నగలు దొంగతనంగా అమ్మడానికి వెళ్లిన ‘సుకుమార్’ పోలీసులకు పట్టుబడతాడు. ఉమాపతి ఐస్ మిల్ లో సుకుమార్ పనిచేస్తూ ఉంటాడు. తాను .. సంధ్య ప్రేమించుకున్నామనీ, తనకి ఆమెనే ఆ నగలు ఇచ్చిందని సుకుమార్ చెబుతాడు. సంధ్యను తాను చంపలేదనీ, ఎవరు చంపారో తెలియదని అంటాడు. దాంతో వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. సంధ్యను హత్య చేసింది ఎవరు? మిగతా రెండు హత్యల వెనుక ఎవరున్నారు? ధూల్ పేట్ లో ఏం జరుగుతుంది? అనేది కథ.
కథనం
స్వార్థ రాజకీయాలు .. రౌడీ రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. పగ – ప్రతీకారం చుట్టూ తిరిగే ఈ కథను ఊరు వైపు నుంచి కాకుండా, పోలీస్ స్టేషన్ వైపు నుంచి చూపిస్తుంది. ధూల్ పేట్ లో ఉండే సెంటిమెంట్స్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను సైతం టచ్ చేస్తూ ఈ కథను నడిపించారు. ఒక వైపున ఊరు .. మరొక వైపున పోలీస్ స్టేషన్ .. ఈ రెండు వైపుల నుంచి ఈ కథను నడిపిస్తూ వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: